పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

ABN , First Publish Date - 2021-10-21T05:49:55+05:30 IST

జిల్లాలో పత్తి కొనుగోళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రతీ యేటా దసరాకు ముందే జిల్లాలోని వెల్గటూరు ప్రాంతంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేవి.

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

- జిల్లాలో రెండు, మూడు రోజుల్లో తెరుచుకోనున్న కేంద్రం

- వర్షం వల్ల ఇంకా ప్రారంభం కాని పత్తి తీత

- జిల్లాలో కొత్త పేటలో కాటన్‌ యార్డు

- రూ. కోట్లలో కొనసాగనున్న వ్యాపారం

జగిత్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి కొనుగోళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రతీ యేటా దసరాకు ముందే జిల్లాలోని వెల్గటూరు ప్రాంతంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేవి. జిల్లాలోని పలు మండలాల్లో పత్తి సాగవుతోంది. పలు మండలాల్లో గుట్ట భూములు అధికంగా ఉండడం, వర్షాధారంతోనే పంటలు పండించడం వంటివి జరుపుతున్నారు. ప్రస్తుత యేడాది భారీ వర్షాల కారణంగా పత్తి పంట ఇంకా చేతికి రాలేదు. కాస్త వర్షం తగ్గడంతో జిల్లాలోని పలు మండలాల్లో పత్తి ఏరేందుకు రైతులు సిద్దమవుతున్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. పత్తిని కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (భారత పత్తి సంస్థ) ఆద్వర్యంలో కొనుగోళ్లు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. 

జిల్లాలో 16,990 మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా...

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 8,480 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోంది. జిల్లాలో సుమారు 16,990 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందన్న వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారుల అంచనా వేశారు. సంబంధిత పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ. 6,025 మద్దతు ధరను ప్రకటించింది. రైతులకు మద్దతు ధరను అందించి పత్తిని కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల వారిగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 2020-21 సంవత్సర కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించి అవసరమైన ప్రచారం చేస్తున్నారు.  

కలెక్టర్‌ రవి ఆదేశాలతో అధికారులు సమాయత్తం...

జిల్లాలో పత్తి కొనుగోళ్లపై రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 8వ తేదీన పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులతో పత్తికొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2021-22 వానాకాలం పంట లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు జరపడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు జరుపనుంది. జిల్లాలోని వెల్గటూరు మండలంలో కొత్తపేటలో గల జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

అన్ని శాఖల సమన్వయంతోనే కొనుగోళ్లు....

జిల్లాలో పత్తి కొనుగోళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉంటోంది. ఇందుకు అనుగుణంగా అవసరమైన కసరత్తుల ను ఆయా శాఖల జిల్లా అధికారులు చేపట్టారు. జిల్లా మార్కెట్‌ అధికారి ప్రకాశ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరేశ్‌, జిల్లా తూనిఖలు, కొలతల శాఖ అధికారి అజీజ్‌, అగ్నిమాపక శాఖాధికారి నర్సింగ్‌ రావు, పత్తిమిళ్లు ట్రైడర్స్‌ రాంబాబు, సీసీఐ అధికారి రజినికాంత్‌ మోరే, మార్కె ట్‌ సెక్రటరీ, విద్యుత్‌, రవాణా తదితర శాఖాధికారులు పత్తి కొను గోళ్లపై దృష్టి సారించారు. ఆయా శాఖల వారిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కస రత్తులు చేస్తున్నారు. జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో కాంటాలు, వే బ్రిడ్జిలను స్టాం పింగ్‌ చేయడం వంటి పనులను లీగల్‌ మెట్రాలజీ అధికారులు జరుపు తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇక్కట్లు లేకుం డా చూడడం వంటివాటిపై అధికారులు దృష్టి సారించారు. పత్తి నిల్వ చేసేందుకు అవసరమైన యార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు. 

పొరుగు జిల్లాల నుంచి సైతం పత్తి రాక...

జిల్లాలోని వెల్గటూరు మండలం కొత్తపేట జిన్నింగ్‌ మిల్లును ఏర్పాటు చేస్తున్న పత్తి కొనుగోలు కేంద్రానికి పొరుగు జిల్లాల నుంచి సైతం రైతులు విక్రయానికి పత్తిని ప్రతీయేటా తీసుకవస్తుంటారు. జగిత్యాల జి ల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులతో పాటు కరీంనగర్‌, నిర్మ ల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల తదితర జిల్లాలకు చెందిన పలువురు రైతులు పత్తిని తరలించి విక్రయిస్తుంటారని జిన్నింగ్‌ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధర ఉందని ప్రైవేటు వ్యాపారులు అంటున్నారు. నా ణ్యమైన పత్తికి ప్రైవేటు మార్కెట్‌లో రూ. 6,500 నుంచి రూ. 7,200 వరకు ధర పలుకుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రైవేటు మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు సీసీఐకి కాకుండా ప్రైవేటు ట్రేడర్ల ద్వారా జిన్నింగ్‌ మిల్లు వ్యాపారులకు విక్రయించుకునే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. జిల్లాలో ప్రతీ యేటా రూ. 30 నుంచి రూ. 50 కోట్ల పత్తి వ్యాపారం జరుగుతుందన్న అంచనా ఉంది. ప్రస్తుత సీజన్‌లో అంతకు మించి పత్తి వ్యాపారం జరు గుతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.


కొనుగోళ్లపై దృష్టి

- కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జిల్లాలో పత్తి కొనుగోళ్లపై అవసరమైన దృష్టి సారించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఇటీవల సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖలకు చెందిన అధికారులు పత్తి కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


 ఏర్పాట్లు చేస్తున్నాము

- రాంబాబు, జిన్నింగ్‌ మిల్లు వ్యాపారి

పత్తి కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాము. వ్యాపారులు రూ. కోట్లలో అప్పులు తెచ్చి మిత్తిలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నా రు. పత్తిని ప్రాసెసింగ్‌ చేసి బేలు(170 కిలోలు)గా మార్చుతున్నాము. బే లు మార్కెట్‌కు స్థానికంగా లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలించ డానికి ఇబ్బందులు పడుతున్నాము.

Updated Date - 2021-10-21T05:49:55+05:30 IST