అభివృద్ధి పనులపై నాణ్యతా పరీక్షలకు సిద్ధమా?: టీడీపీ

ABN , First Publish Date - 2022-08-07T04:47:17+05:30 IST

టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం కింద కమలాపురం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనుల్లో నాణ్య తాపరమైన పరీక్షలు చేసుకునేందుకు వైసీపీ సిద్ధమా అని రైతు సం ఘం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ప్రశ్నించారు.

అభివృద్ధి పనులపై నాణ్యతా పరీక్షలకు సిద్ధమా?: టీడీపీ
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

కమలాపురం రూరల్‌, ఆగస్టు6 : టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం కింద కమలాపురం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనుల్లో నాణ్య తాపరమైన పరీక్షలు చేసుకునేందుకు వైసీపీ సిద్ధమా అని రైతు సం ఘం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా ప్రశ్నించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇప్పిటికే ఈ పనులపై మూడు సంస్థల ద్వారా మూడు సార్లు విచారించిందని, ఆ మూడు సంస్థల వారు నాణ్యతా ప్రమాణాలు లోపం ఎక్కడా జరగలేదని నివేదికలు ఇచ్చినప్పటికీ కాట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదన్నారు. నీరు-చెట్టు పనులపై విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఈ మూడేళ్లలో వారు చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తోందన్నారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ, పాపాగ్ని నదిలో అప్రోచ రోడ్డు నిర్మాణంతో పాటు వివిధ పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై విజిలెన్స విచారణ కోరే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కంకర సుబ్బారెడ్డి, దివాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన నరసింహారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి, పల్లె రామసుబ్బారెడ్డి, శంకర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T04:47:17+05:30 IST