అన్ని పార్టీలూ మద్దతిస్తే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సిద్ధం: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2021-07-25T08:07:15+05:30 IST

అన్ని రాజకీయ పార్టీలూ మద్దతిస్తే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్‌ అన్నారు...

అన్ని పార్టీలూ మద్దతిస్తే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సిద్ధం: లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): అన్ని రాజకీయ పార్టీలూ మద్దతిస్తే ఓబీసీలకు చట్టసభల్లో  రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్‌ అన్నారు. ఓబీసీల పాలిట కాంగ్రెస్‌ విలన్‌గా మారిందన్నారు. ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడానికీ కాంగ్రెస్‌ అంగీకరించలేదని ఆరోపించారు. ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించాలని నిర్ణయించామన్నారు. ప్రతీ రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణతోసహా అనేక రాష్ట్రాల్లో బీసీ కమిషన్‌ లేదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మస్లీంలను ఓబీసీ జాబితాలో చేర్చి బీసీల ప్రయోజనాలకు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ బీసీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని లక్మణ్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-25T08:07:15+05:30 IST