పుస్తకాలు చదివించండిలా!

ABN , First Publish Date - 2021-03-01T05:41:11+05:30 IST

ఒక కామిక్‌ పుస్తకం లేదా కథల పుస్తకం చదివితే ఒత్తిడి తగ్గిపోయి ఉల్లాసం నిండుతుంది. అందుకే పుస్తక పఠనాన్ని పిల్లలకు తప్పనిసరిగా అలవాటు చేయాలి. అందుకు ఏం చేయాలంటే...

పుస్తకాలు చదివించండిలా!

ఒక కామిక్‌ పుస్తకం లేదా కథల పుస్తకం చదివితే ఒత్తిడి తగ్గిపోయి ఉల్లాసం నిండుతుంది. అందుకే పుస్తక పఠనాన్ని పిల్లలకు తప్పనిసరిగా అలవాటు చేయాలి. అందుకు ఏం చేయాలంటే...


  1. పిల్లలు చాలా విషయాలు పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు పుస్తకాలు చదువుతుండడం చూసి, పిల్లలు కూడా పుస్తకాలు తిరగేయడం మొదలెడతారు. 
  2. తల్లిదండ్రులు పిల్లలకు ముందుగా పుస్తకాల్లోని విషయాలను చదివి వినిపించాలి. లేదంటే వారు చదువుతున్నప్పుడు ఆసక్తిగా వినాలి. ప్రశ్నలు అడుగుతూ, ఆయా అంశాల మీద వారితో చర్చించాలి.
  3.  నక్షత్రాలు, సంగీతం, వింతలు విశేషాలు వంటివి పిల్లలను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ రకం పుస్తకాలను కొనిస్తే వారు ఇష్టంగా చదువుతారు.
  4. ఒత్తిడిని దూరం చేసి, ఉల్లాసాన్ని ఇచ్చే సాధనంగా పుస్తక పఠనం ఉపయోగపడుతుందని పిల్లలకు వివరించాలి.
  5. రంగురంగుల బొమ్మలతో కూడిన పుస్తకాలను పిల్లలకు అందిస్తే వాటిలోని విషయాలను వారు తొందరగా అర్థం చేసుకుంటారు.

Updated Date - 2021-03-01T05:41:11+05:30 IST