ప్రణాళిక ప్రకారం చదివి కొలువులు సాఽదించాలి

ABN , First Publish Date - 2022-05-18T05:36:17+05:30 IST

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధించాలని ఎమ్మె ల్యే జోగురామన్న ఆకాంక్షించారు.

ప్రణాళిక ప్రకారం చదివి కొలువులు సాఽదించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, మే17: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధించాలని ఎమ్మె ల్యే జోగురామన్న ఆకాంక్షించారు. చాందా(టి)లోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం గురుకులంలో అభ్యర్థులకు భోజన వసతి ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా అభ్యర్థులే అధికంగా ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం నోటఫికేషన్‌ ఇవ్వడంలో ఆలస్యమైందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఉచితంగా శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. కష్టంతో పాటు ప్రణాళికలతో చదువుతూ కొలువులను సాధించాలని ఆకాంక్షించారు. కోచింగ్‌కు సంబంధించి ఎలాంటి స్టడీ మెటీరియల్స్‌ అయిన అవసరమైన పుస్తకాలను జోగుపౌండేషన్‌ ద్వారా అందిస్తామన్నారు. ఆయా శాఖల్లో దాదాపు 2100 ఖాళీలున్నాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా అందించే శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ, మున్సిపల్‌ చైర్మన్లు అడ్డిభోజారెడ్డి, జోగుప్రేమేందర్‌, డీఎండబ్ల్యూవో కృష్ణవేణి, గురుకులం ప్రిన్సిపాల్‌ చారి, కౌన్సిలర్లు అజయ్‌, బండారి సతీష్‌, అశోక్‌స్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు యూనుస్‌అక్బాని, మెట్టు ప్రహ్లాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:36:17+05:30 IST