India-UAE flights: ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-08-11T20:16:23+05:30 IST

యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ఇండియన్ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక సూచన చేసింది.

India-UAE flights: ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన!

న్యూఢిల్లీ: యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ఇండియన్ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమాన సమయానికి ఆరు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని కోరింది. "భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు కనీసం ఆరు గంటల ముందు చేరుకోవాలి. ఎందుకంటే యూఏఈలో ఎంట్రీ నిబంధనల ప్రకారం పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. కనుక ప్రతి ప్రయాణికుడికి విమానాశ్రయంలో రాపిడ్ పీసీఆర్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్టు కౌంటర్లు ప్రయాణ సమానికి నాలుగు గంటల ముందు తెరచుకుంటాయి. అలాగే విమానం బయల్దేరడానికి రెండు గంటల ముందు మూతపడతాయి. అందుకే ప్రయాణికులు కనీసం ఆరు గంటల ముందు విమానాశ్రయాలకు చేరుకోవాలి" అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తన ప్రకటనలో పేర్కొంది.




Updated Date - 2021-08-11T20:16:23+05:30 IST