ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:24:11+05:30 IST

ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యా లయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఎక్సైజ్‌శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌లను కోరారు.

ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలి
వినతిపత్రం అందిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

  - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

- ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు వినతి

అయిజ, జనవరి 28 : ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యా లయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఎక్సైజ్‌శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌లను కోరారు. గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సింగిల్‌విండో చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, అయిజ మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్నతో కలిసి వారికి వినతిపత్రం అందించారు. తుంగభద్రానది నీటి వా టాను వినియోగించుకుంటూనే, ప్రత్యామ్నయంగా ఆర్డీఎస్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవా లని కోరారు. ఆర్డీఎస్‌ ప్రధాన ఆనకట్ట రంధ్రాలు పూడ్చాలని, పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని, తుంగభద్రానదిలో నీటి వాటాను కోల్పోకుండా ఉండటం కోసం కుట్కనూర్‌ దగ్గర లిప్టు ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌ పనులు పూర్తిచేసి ఆర్డీఎస్‌ కాలువకు లింక్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిన్నహన్మంతు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్లాస్‌పూర్‌ నర్సింహరెడ్డి, ఆంజనేయులు, వెంకటరాముడు, బడేసాబ్‌, బ్రహ్మ య్య, రంగన్న, ఎద్దులరాముడు, రాజాపూర్‌ రంగ న్న, ముక్తర్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేసి గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీటిని అందించాలని అయిజ మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ శుక్రవారం చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా తిర్మల్‌రెడ్డి అలంపూర్‌ నియోజకవర్గ రైతులతో కలిసి వెళ్లి ఆమెతో మాట్లాడారు. రిజర్వా యర్‌ పనులు పెండింగ్‌లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నర్సింహులు, మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్‌, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:24:11+05:30 IST