ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ ఏజెన్సీల కేటాయింపు

ABN , First Publish Date - 2021-05-07T03:44:33+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకటం లేదని కలెక్టర్‌కు అందిన సమాచారం మేరకు జిల్లాలోని ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల

ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ ఏజెన్సీల కేటాయింపు
ఆసుపత్రిలో సమస్యలను తెలుసుకుంటున్న ఆర్డీవో శ్రీనివాసులు

ఆర్డీవో శ్రీనివాసులు

కావలి, మే 6: కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకటం లేదని కలెక్టర్‌కు అందిన సమాచారం మేరకు జిల్లాలోని ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల ఏజెన్సీలను అటాచ్‌ చేయటం జరిగిందని ఆర్డీవో జీ.శ్రీనివాసులు చెప్పారు. ఆక్సిజన్‌ సిలండర్ల కొరతపై తెలుసుకునేందుకు ఆర్డీవో గురువారం కందుకూరి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని సంద ర్శించారు. అక్కడ ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్‌ సమస్య తదితర వివరాలను ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ రామస్వామిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కరోనా పేషంట్ల సహాయ కులను పెద్దగా రానివ్వకుండా సేవలు అందించేలా చూడాలని సూచించారు. కందుకూరి ఆసుపత్రికి కోవూరు దగ్గర ఉన్న ఇనమడుగు గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌ను అటాచ్‌ చేయటం జరిగిందని అక్కడ నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, నోడల్‌ అధికారి కావలి ఎంపీడీవో భవాని తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-07T03:44:33+05:30 IST