Abn logo
Oct 24 2020 @ 05:35AM

న్యాయమైన పరిహారం ఇస్తాం

ఆర్డీవో వెంకటేశ్వర్లు ఏపీఐఐసీ జోనల్‌  మేనేజర్‌ నారాయణమ్మ


ఓర్వకల్లు, అక్టోబరు 23: ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి ఐక్యసంఘం భవనంలో రైతులతో సమావేశం నిర్వహించారు.  మీదివేముల, గుట్టపాడు, బ్రాహ్మణపల్లె, కన్నమడకల గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నారాయణమ్మ మాట్లాడుతూ రైతులు చెప్పిన ప్రతి అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఎకరాకు రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. తహసీల్దార్‌ శివరాముడు, ఆర్‌ఐలు, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement