వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2021-01-21T04:01:11+05:30 IST

మండలంలోని రవీంద్రనగర్‌-2 గ్రా మంలో సర్వే నెం.114/135/ఏలో గల వివాదాస్పద భూమిని బుధవారం ఆర్డీవో చిత్రు పరిశీలించారు.

వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో
వివాదస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో చిత్రు

చింతలమానేపల్లి, జనవరి 20: మండలంలోని రవీంద్రనగర్‌-2 గ్రా మంలో సర్వే నెం.114/135/ఏలో గల  వివాదాస్పద భూమిని బుధవారం ఆర్డీవో చిత్రు పరిశీలించారు. ఈ భూమి విషయంపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టాదారు విప్లవ్‌ వైద్య హైకోర్టును ఆశ్రయించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ ఆర్డీవో చిత్రు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు. భూ రికార్డుల పరి శీలన అనంతరం తహసీల్దార్‌కు వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్‌ సుశీల్‌ ఆర్డీవోతో మాట్లాడుతూ రవీంద్రనగర్‌-2 గ్రామ ప్రజల సౌకర్యార్థం శ్మశానవాటిక పనులు చేపట్టామని చెప్పారు. విప్లవ్‌ వైద్య తప్పుడు పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. గ్రామస్థులకు న్యాయం చేయాలని సర్పంచ్‌ కోరారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ బికర్ణదాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-21T04:01:11+05:30 IST