డబ్బు వసూలుపై విచారణ

ABN , First Publish Date - 2020-10-30T10:37:32+05:30 IST

కొంత కొలంగా డిచ్‌పల్లి 30 పడకల ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్‌ల చేసుకున్న వారి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వైద్య సిబ్బం దిని ఆర్డీవో రవి కలెక్టర్‌ ఆదేశాల ..

డబ్బు వసూలుపై విచారణ

వైద్య సిబ్బందిని ప్రశ్నించిన ఆర్డీవో 

కు.ని. ఆపరేషన్‌లు చేసుకున్న వారి వద్దకే వెళ్తాం : ఆర్డీవో  రవి


డిచ్‌పల్లి, అక్టోబరు 29: కొంత కొలంగా డిచ్‌పల్లి 30 పడకల ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్‌ల చేసుకున్న వారి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వైద్య సిబ్బం దిని ఆర్డీవో రవి కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం విచారించారు. కు.ని. ఆపరేషన్ల కోసం డబ్బులు ఎం దుకు వసూలు చేశారని, ఆర్డీవో వైద్య సిబ్బందిని వి చారించగా వారి నోటి నుంచి తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆర్డీవో పరిస్థితి పూర్తిగా గమనించి వివరా లను నమోదు చేసుకున్నారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది డాక్టర్‌ ఆశ్విని, దేవిమేరి, అనిత, మరికొంత మంది సిబ్బందిని ఆర్డీవో వివరాలు అడిగారు. బాధితులే కు.ని. అపరేషన్లు చేయడానికి తీసుకున్న డబ్బుల వివరాలను బాధితులు ఫిర్యాదు చేసిన పత్రాలను చూపుతూ ప్ర శ్నించడంతో వైద్య సిబ్బంది నీళ్లు నమిలారు. ఇందల్వా యి పీహెచ్‌సీ పరిధిలోని మిట్టపల్లి తండాకు చెందిన బాదవత్‌ రజిత వద్ద వైద్య సిబ్బంది కు.ని. ఆపరేషన్‌ కోసం రూ.2300, అదే తండాకు చెందిన భూక్య సూజాత వద్ద రూ.4200, రాధిక వద్ద రూ.3300, మల్లాపూర్‌కు చెందిన నవ్య రూ.4900, మీన రూ.6300 తోపాటు ఒక్క కరోనా సమయంలోనే డిచ్‌పల్లి ఆస్పత్రిలో 130మందికి కు.ని. ఆపరేషన్లు చేసిన వివరాలు ఆర్డీవో వద్దకు చేర డంతో వైద్య సిబ్బంది విచారణ సమయం లో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.


అంతే గాకుం డా ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేసిన వైద్య సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుక లా తయారైంది. అంతే గాకుండా ఆస్పత్రి లో జరిగిన కు.ని. ఆపరేషన్లపై డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు కూడా ఫిర్యా దులు వెళ్లాయి. ఆస్పత్రిలోని మెడికల్‌ ఆఫీ సర్‌ డాక్టర్‌  ఆశ్విని, డాక్టర్‌ పద్మావతి, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సవిత, ఓపీ సిస్టర్‌ భార్గవిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయ మే ఆర్డీవో రవి రెండు గంటల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 


డబ్బులు ఇచ్చిన వారినే కలుస్తాం... 

డిచ్‌పల్లి సామాజిక ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్లు కో సం సిబ్బంది అక్రమ డబ్బులు వసూళ్లపై ఆపరేషన్లు చేసుకున్న బాధితుల వద్దకే వెళ్లి ప్రత్యక్షంగా విచారిస్తా మని ఆర్డీవో రవి విలేకర్లతో చెప్పారు. విచారణలో వైద్య సిబ్బంది వాస్తవాలు కప్పిపుచ్చుతున్నందున ఈ  నిర్ణ యాన్ని తాను తీసుకున్నమన్నారు. డిచ్‌పల్లి ఆస్పత్రి పరి ధిలోని కు.ని. ఆపరేషన్లు చేసుకున్న బాధితుల ఇంటికి వెళ్లి కలిసి వివరాలు సేకరిస్తామన్నారు. నాలుగు రోజు ల్లో ఈ విచారణ పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆర్డీవో తెలిపారు. ఆర్డీవో వెంట తహ సీల్దార్‌  వేణుగోపాల్‌ గౌడ్‌  ఉన్నారు.


సిబ్బంది నిర్వాకం వల్లే..

ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది నిర్వాకం వల్లే డిచ్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో రెగ్యూలర్‌ వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇన్‌చార్జ్‌ వైద్య సిబ్బంది తమను ప్రశ్నించే వారు లేరని ఉద్దేశంతో నిరక్ష్య రాస్య త కల్గిన గ్రామీణ ప్రజల వద్ద వేలాది రూపాయలు వసూళ్లు చేశారు. కు.ని. ఆపరేషన్ల కోసం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, నర్మల్‌ ఆపరేషన్లకు రూ.2 వేలనుంచి రూ.3వేలు వసులు చేయడం గమనార్హం. ఆస్పత్రిలో గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారి డాక్టర్‌ బాబురావు ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చే యడం కొసమెరుపు.

Updated Date - 2020-10-30T10:37:32+05:30 IST