భూ వివాదంపై ఆర్డీవో విచారణ

ABN , First Publish Date - 2022-09-29T06:17:26+05:30 IST

భూ వివాదంపై తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి బుధవారం సొబ్బాల పంచాయతీ కార్యాలయం వద్ద విచారణ చేశారు.

భూ వివాదంపై ఆర్డీవో విచారణ
విచారణను నిర్వహిస్తున్న ఆర్డీవో ప్రసన్నలక్ష్మి

గంపలగూడెం, సెప్టెంబరు 28: భూ వివాదంపై తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి బుధవారం సొబ్బాల  పంచాయతీ కార్యాలయం వద్ద విచారణ చేశారు. కొనకంచి రాధమ్మకు సర్వే నంబరు 263లో 2.33 ఎకరాలుంది. అందులో 1.40 ఎకరాలకు నున్న వెంకటేశ్వరరావుకు 2018లో పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేశారు. మిగిలిన 93 సెంట్లు నున్న అంజమ్మ సాగు చేసుకుంటున్నారు. 1.40లో 75 సెంట్లకు సర్వే సర్టిఫికెట్‌ తీసుకొని 2021లో కంభంపాటి ఆంజనేయులు రిజిస్ట్రేషన్‌ చేయించుకు న్నాడు. ఆంజనేయులు తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించా డని అందులో 35 సెంట్లు తనకు వస్తుందని అంజమ్మ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో తహసీల్దార్‌ విచారించి 35సెంట్లు నున్న అంజమ్మ పేరుతో పట్టాదారుపాస్‌పుస్తకం ఇచ్చారు. దీనిపై ఆంజనేయులు అన్యాయం అంటూ కలెక్టర్‌కు స్పంద నలో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన  ఆర్డీవోను విచారణకు ఆదేశిం చారు.  సర్వే నంబరు 283లో భూమి మొత్తాన్ని రీ సర్వేచేసి వివాదంలో ఉన్నవారు మీ వద్ద ఉన్నా ఆధా రాలను తన ముందు ఉంచాలని ఆదేశించారు.  తహ సీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌ ఉన్నం కృష్ణారావు, ఆర్‌ఐ మోహన్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T06:17:26+05:30 IST