సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో

ABN , First Publish Date - 2020-12-03T05:03:26+05:30 IST

పట్టణంలోని బిట్‌-3 సచివాలయాన్ని బుధవారం నెల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి హుస్సేన్‌ సాహెబ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో
సచివాలయ రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌

పొదలకూరు, డిసెంబరు 2 : పట్టణంలోని బిట్‌-3 సచివాలయాన్ని బుధవారం నెల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి హుస్సేన్‌ సాహెబ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. మండలంలో 10గృహాలు తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్నాయన్నారు. సచివాలయ సిబ్బంది సచివాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే సమయపాలన పాటించాన్నారు. హాజరు పట్టిక, రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈనెల 25న పేదలకు పంచే ఇళ్ల పట్టాల వివరాలను సేకరించారు.  కార్యక్రమంలో ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి శోభన్‌బాబు, తహసీల్దారు స్వాతి, ఎంపీడీవో నారాయణరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-12-03T05:03:26+05:30 IST