సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ అనూహ్య విజయం

ABN , First Publish Date - 2021-04-15T04:50:45+05:30 IST

ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింద. మ్యాచ్ చివరి వరకు గెలుపు ఇద్దరు కెప్టెన్లతోనూ దోబూచులాడింది. దీంతో చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. అయితే చివరి 5 ఓవర్లలో ..

సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ అనూహ్య విజయం

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ చివరి వరకు గెలుపు ఇరు జట్లతోనూ దోబూచులాడింది. దీంతో చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. అయితే ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌ను మలుపుతిప్పేశారు. 10 ఓవర్ల వరకు బెంగళూరుతో పోల్చితే ముందంజలో ఉన్న సన్‌రైజర్స్.. కెప్టెన్ డేవిడ్ వార్నర్(38: 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ తర్వాత అతలాకుతలమైంది. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మన్ లయ కోల్పోయారు. ముఖ్యంగా 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన రైజర్స్ మ్యాచ్‌పై ఆశలు కఠినం చేసుకుంది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆర్సీబీవైపు మళ్లింది. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా.. 9 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. 


నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో టాప్ ప్లేస్‌కు చేరింది. ఆర్సీబీ తరపున అర్థ సెంచరీతో రాణించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బెంగళూరు బౌలర్లలో షహబాజ్ నదీమ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, కైల్ జేమీసన్‌కు 1 వికెట్ దక్కింది. ఆర్సీబీ విజయంలో 17వ ఓవర్ వేసిన షెహబాజ్ అహ్మద్.. అద్భుత ఓవర్‌తో 3 వికెట్లు తీసి సన్‌రైజర్స్ వెన్ను విరిచాడు. 



Updated Date - 2021-04-15T04:50:45+05:30 IST