IPL 2022: ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన Dinesh Karthik

ABN , First Publish Date - 2022-05-28T00:56:29+05:30 IST

ఐపీఎల్(IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్(Bangaluru roaya challengers) స్టార్ బ్యాట్స్‌‌మెన్-వికెట్ కీపర్ దినేష్ కార్తీక్

IPL 2022: ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన Dinesh Karthik

కోల్‌కతా : ఐపీఎల్(IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్(Bangaluru roaya challengers) స్టార్ బ్యాట్స్‌‌మెన్-వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik)ను టోర్నీ మేనేజ్‌మెంట్ తీవ్రంగా మందలించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ నిబంధనలను ఉల్లంఘించాడని ఐపీఎల్ అఫీషియల్ మీడియా శుక్రవారం ప్రకటించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని 2.3 నిబంధన ప్రకారం దీనేష్ కార్తీక్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతడు ఒప్పుకున్నాడు. జరిమానాకు అంగీకరించాడని ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్, ఈ నిర్ణయానికి ఆటగాళ్లు కట్టుబడి ఉండాల్సివుంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘించడం లెవల్ 1 నేరంగా పరిగణిస్తారని ప్రస్తావించింది. కాగా లక్నోపై మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం అందుకుని క్వాలిఫయర్ -2 మ్యాచ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.


కాగా ఎలిమినేటర్ -1 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై దినేష్ కార్తీక్ రాణించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరిలో చెలరేగి ఆడి 23 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థికి 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో రజత్ పటీదార్‌కు కార్తీక్ చక్కటి భాగస్వామ్యం అందించాడు. చివరకు 14 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఆర్సీబీ క్వాలిఫయర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. మరోవైపు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 64.80 పరుగుల సగటుతో మొత్తం 324 పరుగులు చేశాడు. ఇక స్ట్రైక్ రేటు 187.28 గా ఉండగా ఈ సీజన్‌లో అత్యధికంగా ఢిల్లీపై 66 పరుగలు చేశాడు.

Updated Date - 2022-05-28T00:56:29+05:30 IST