RCB Fans Dream: ముగ్గురూ కలిసి ఆడితే.. అంటే అన్నాడు గానీ.. ఆ ఊహే ఎంత బాగుందో..

ABN , First Publish Date - 2022-05-26T02:45:35+05:30 IST

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంది. కలర్‌ఫుల్ లీగ్ మొదలైనప్పటి నుంచి స్టార్ ప్లేయర్లతో..

RCB Fans Dream: ముగ్గురూ కలిసి ఆడితే..  అంటే అన్నాడు గానీ.. ఆ ఊహే ఎంత బాగుందో..

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంది. కలర్‌ఫుల్ లీగ్ మొదలైనప్పటి నుంచి స్టార్ ప్లేయర్లతో క్రేజీ టీమ్ అనిపించుకుంటోంది. ముందు నుంచి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్. ఏళ్లుగా బెంగళూరుతోనే జర్నీ కొనసాగిస్తున్నాడు. ఎప్పుడూ మరో జట్టుకు ఆడాలని ఆలోచించలేదు. ఇప్పటికీ ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ..విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ అని ఫ్యాన్స్ అనుకుంటారు. విరాట్ మీద అభిమానంతోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. కోహ్లీ తర్వాత డివిలియర్స్ కూడా ఆర్సీబీకి గతంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉన్నాడు.



గత సీజన్‌లో ఐపీఎల్‌కు బై చెప్పినా..మళ్లీ వచ్చే ఏడాది ఎంట్రీ ఇస్తానన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీలో కనిపిస్తానన్నాడు. మిస్టర్ త్రీ సిక్స్‌టీ రీఎంట్రీపై ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. కోహ్లీ-డివిలియర్స్ కాంబినేషన్‌ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరికీ ఆర్సీబీ మాజీ ప్లేయర్ గేల్ కూడా కలిస్తే ఎలా ఉంటుంది అన్నదే అభిమానుల్లో డిస్కషన్ పాయింట్‌గా మారింది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున గేల్ ఆకట్టుకున్నాడు. తర్వాత ఫ్రాంచైజీ మారినా..ఈ ఏడాది కలర్‌ఫుల్ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు.



అయితే వచ్చే సీజన్‌లో ఆడేందుకు ఫిట్‌నెస్ కాపాడుకునే పనిలో ఉన్నాడు. తాను మళ్లీ వస్తానంటూ ఇప్పటికే హింటిచ్చాడు. ఇటీవలే ఆర్సీబీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ డివిలియర్స్‌తో కలిసి ప్లేస్ కొట్టేశాడు. డివిలియర్స్‌-గేల్ పేర్లను కోహ్లీయే ప్రకటించాడు..! ఆర్సీబీ కార్యక్రమంలో ఈ ముగ్గురూ కలిసినప్పటి నుంచి అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయ్. విరాట్, డివిలియర్స్‌, గేల్..ఈ ముగ్గురూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడితే అదిరిపోతుందంటున్నారు. ఆ ఊహ నిజం కావాలని కోరుకుంటున్నారు. డివిలియర్స్ వచ్చే సీజన్‌లో ఎంట్రీ ఇస్తానని చెప్పాడు ..కానీ ప్లేయర్‌గానా మెంటర్‌గానా అనేది తేలలేదు. అభిమానులు మాత్రం ఈ ముగ్గురూ కలిసి బరిలో దిగాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2022-05-26T02:45:35+05:30 IST