ఆర్సీబీ ఫ్లాప్‌షో.. 68 పరుగులకే ఆలౌట్.. ఎవరెవరు ఎన్ని కొట్టారంటే..

ABN , First Publish Date - 2022-04-24T02:38:38+05:30 IST

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కేవలం 68 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది.

ఆర్సీబీ ఫ్లాప్‌షో.. 68 పరుగులకే ఆలౌట్.. ఎవరెవరు ఎన్ని కొట్టారంటే..

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 16.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి అద్భుతంగా రాణించడంతో బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ ఎదురునిలవలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. హైదరాబాద్ పేసర్ మార్కో జన్‌సెన్ ధాటికి బెంగళూర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 3 వికెట్లతో విజృంభించాడు. టీ నటరాజన్ (3), జగదీష్ సుచిత్(2), భువనేశ్వర్ కుమార్(1), ఉమ్రాన్ మాలిక్(1) చొప్పున వికెట్లు తీశారు.  బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో డుప్లెసిస్ (5), అనుజ్ రావత్(0), విరాట్ కోహ్లీ(0), మ్యాక్స్‌వెల్(12), సుయాస్ ప్రభుదేశాయ్(15), షాబాజ్ అహ్మద్(7), దినేష్ కార్తీక్(0), హర్షల్ పటేల్(4), వణింద్ హసరంగా(8), మొహమ్మద్ సిరాజ్(2), హేజల్‌వుడ్(3 నాటౌట్) పేలవ ప్రదర్శన చేశారు. కాగా స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 


జట్టు స్కోరు 5 పరుగుల వద్ద తొలి రెండు వికెట్లు డ్లూపెస్లిస్, విరాట్ కోహ్లీ, 8 పరుగుల వద్ద 3వ వికెట్‌గా అనుజ్ రావత్, 20 పరుగుల వద్ద గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ రూపంలో నాలుగవ వికెట్, 47 పరుగుల వద్ద సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్‌లు, 49 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్, 55 పరుగుల వద్ద హర్షల్ పటేల్, 65 పరుగుల వద్ద వణింద్ హసరంగ, 68 పరుగుల వద్ద 10వ వికెట్‌గా మొహమ్మద్ సిరాజ్ ఔటయ్యారు.

Updated Date - 2022-04-24T02:38:38+05:30 IST