నెలాఖరులోగా ఆర్‌బీకే నిర్మాణాలు పూర్తి చేయాలి: జేసీ

ABN , First Publish Date - 2021-06-25T06:47:20+05:30 IST

గ్రామాల్లో రైతుభరోసా, సచివాలయ భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

నెలాఖరులోగా ఆర్‌బీకే నిర్మాణాలు పూర్తి చేయాలి: జేసీ
ఉడేగోళం వద్ద సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌

రాయదుర్గం రూరల్‌, జూన 24: గ్రామాల్లో రైతుభరోసా, సచివాలయ భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని ఆవులదట్ల, 74 ఉడేగోళం గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 802 నూతన రైతు భరోసా కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా జూలై 8న రైతు దినోత్సవం సందర్భంగా 200 భవనాల ను ప్రారంభించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ సమీకృత ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ డీఈ రామ్మోహన రెడ్డి, ఇంజనీర్‌ మునుస్వామి, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో కొం డయ్య, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 


 ఏడీ అవినీతి ఆరోపణలపై విచారణ: జేడీఏ

రాయదుర్గంటౌన్‌ : రాయదుర్గం వ్యవసాయ సహాయ సంచాలకురాలు పుష్పలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు జిల్లా వ్య వసాయ సంచాలకులు రామక్రిష్ణ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రూ.70 లక్షల నాబార్డు నిధులతో నిర్మిస్తున్న రైతు భరోసా కేం ద్రం నిర్మాణ పనులను జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌, జేడీఏ రామక్రిష్ణ గురువారం పరిశీలించారు. అనంతరం స్థానిక అర్‌అండ్‌బీ అతిథిగృహంలో జేడీఏ విలేకరులతో మాట్లాడారు. రాయదుర్గం వ్యవసాయ సహా య సంచాలకురాలు పుష్పలత అవినీతి ఆరోపణల నేపథ్యంలో సెలవులో వున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తనిఖీ చేసిన రికార్డులు సవ్యంగా వున్న ట్లు తెలిపారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆమె స్థానంలో త్వరలో మరో అధికారిని నియమిస్తామన్నారు. 

     

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రాయదుర్గం, ఉరవకొండ, పెనుకొండ, మడకశిర, కొత్తచెరువు, తాడిపత్రి, నార్పల ప్రాంతాల్లో ఒక్కో భవనం రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖరీ ఫ్‌ సాగుకు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 2.32 లక్షల క్వింటాళ్ల రాయితీ వేరుశనగ రైతులకు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఏడు వేల క్వింటాళ్ల విత్తన కందులు, పెసర పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దా ర్‌ సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్‌ డీఈ రామ్‌మోహన్‌ రెడ్డి, వ్యవసాయ అధికారి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-25T06:47:20+05:30 IST