సొంత భవనాలలో సాగని పాలన

ABN , First Publish Date - 2022-06-06T05:22:42+05:30 IST

ప్రతి సచివాలయానికి అనుబం ధంగా రైతుభరోసా కేంద్రం, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూని ట్లు(బీఎంసీయూ)

సొంత భవనాలలో సాగని పాలన

 ఉలవపాడు, జూన్‌ 5 : ప్రతి సచివాలయానికి అనుబం ధంగా రైతుభరోసా కేంద్రం, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూని ట్లు(బీఎంసీయూ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి మూడేళ్లవుతున్నా పాలన మాత్రం అద్దె భవనాలకే పరిమిత మైంది. మండలంలో 16 సచివాలయాలు ఉండగా వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రం, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు మంజూరయ్యాయి. మేజర్‌ పంచాయతీ ఉలవ పాడులో మూడు సచివాలయాలకు రెండు రైతు భరోసా కేంద్రాలు పూర్తయ్యాయి. అదేవిధంగా మన్నేటికోట, బద్దిపూ డి, భీమవరం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు కూడా పూర్తయ్యి అలంకారప్రాయంగా ఉన్నాయి. ఒక్క భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.21.80 లక్షలు కేటాయించింది. మొత్తం 5 భవనాల నిర్మాణం పూర్తి కావడంతో రంగులు వేసి ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలిన 11 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. చేసిన పనికి బిల్లులు పడకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. 

 రైతులకు ఒరిగింది శూన్యం.. 

ప్రతి రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అసిస్టెంట్లు ఉంటారు. గత ప్రభుత్వంలో సేవలకంటే ప్రత్యేకమైన సేవలు అందించింది ఏమిలేదని కొందరు రైతులు పెదవి విరుస్తున్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులకు ముంద స్తుగా రైతు డబ్బు చెల్లించి అవసరమైన రసాయనిక ఉత్ప త్తులను కొనుగోలు చేసుకోవాలి. అయితే ముందస్తు పెట్టు బడి పెట్టి ఎరువులు, పురుగుమందులు అరువుకు ఇస్తున్న ప్రైవేటు డీలర్ల వైపు 90 శాతం మంది సన్నచిన్నకారు రైతులు మొగ్గు చూపుతుండటం విఽశేషం. మరోవైపు మత్స్య, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు రైతు భరోసా కేంద్రాలను వదిలి ఎక్కువ సమయం ఆయా శాఖల కార్యాలయాల్లోనే గడుపుతున్నారు.

 ఆగిన బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు 

గ్రామాల్లో పాల కేంద్రాల నుంచి పాలు సేకరించి ప్రభు త్వం నిల్వ చేసేందుకు నిర్మించదలచిన చిల్లింగ్‌ యంత్ర భవ నాలు పురిటిలోనే ఆగిపోగా మరికొన్ని మొదలే పెట్టలేదు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.17.65 లక్షలు కేటాయించారు. మండలంలో మొత్తం 16 భవనాలు నిర్మించాల్సి ఉండగా అందులో 11 శ్లాబు లెవెల్‌ వరకు, 3 బేస్‌మట్టం వరకు నిలిచిపోగా ఆత్మకూరు, పెదపట్టపుపాలెంలో ఇప్పటికీ పునాదులు కూడా వేయలేదు. రెండేళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీతో ఒప్పందంలో భాగంగా ఈ కేంద్రాలు తలపెట్టిన విషయం తెలిసిందే. అమూల్‌ కంటే ఇతర డెయిరీలకు పాల విక్రయాలతోనే  గిట్టుబాటుగా ఉందని పాడి రైతులు నిర్ణయించుకున్నారు. ఈ కారణంతో నిర్మాణాలపై పెద్దగా దృష్టి సారించడం లేద న్న అభిప్రాయాలు ప్రభుత్వ అధికారుల నుంచే వ్యక్తమవుతున్నాయి. 

 ప్రజా ధనం వృథా..

ప్రజా ప్రయోజనాలకు ఉపయోగం లేని వ్యవస్థలకు భవన నిర్మాణాల రూపంలో వేల కోట్ల ప్రజా ధనం వైసీపీ ప్రభుత్వం వృథా చేస్తుందని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా, పాల కేంద్రాల భవన నిర్మాణాలతో ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేకపోగా మరోపక్క ప్రైవేటు భవనాలకు అద్దెలు చెల్లించడం కూడా ప్రజలపై భారం మోపినట్లేనని ప్రజల నుంచి సర్వత్రా మిమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-06-06T05:22:42+05:30 IST