RBI : త్వరలో డిజిటల్ రుపీ

ABN , First Publish Date - 2022-10-07T22:30:18+05:30 IST

ఇక రానున్నది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ

RBI : త్వరలో డిజిటల్ రుపీ

న్యూఢిల్లీ : ఇక రానున్నది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (Central Bank Digital Currency - CBDC) యుగం. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ను భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసింది. నిర్దిష్ట సందర్భాల్లో వినియోగించడం కోసం డిజిటల్ రుపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. 


మన దేశంలో సీబీడీసీపై అవగాహన కల్పించడం కోసం ఈ కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ రుపీ ప్లాన్డ్ ఫీచర్స్‌ గురించి ప్రజలకు తెలియజేయడం కోసం దీనిని జారీ చేసినట్లు తెలిపింది. సీబీడీసీ జారీలో రిస్క్‌లు, లక్ష్యాలు, చాయిస్‌లు, ప్రయోజనాలను ఈ నోట్ వివరిస్తుందని తెలిపింది. సీబీడీసీని పరిచయం చేయడంలో ఆర్బీఐ వైఖరిని కూడా ఇది వివరిస్తుందని తెలిపింది. 


టెక్నాలజీ, డిజైన్ చాయిసెస్, డిజిటల్ రుపీని ఉపయోగించడానికి అవకాశాలు, జారీ యంత్రాంగాల గురించి ఈ నోట్ చర్చిస్తుందని తెలిపింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో సీబీడీసీని ప్రవేశపెట్టడం వల్ల ఎదురయ్యే పరిస్థితులను పరిశీలిస్తుందని, ప్రైవసీ సమస్యలను విశ్లేషిస్తుందని పేర్కొంది.  ద్రవ్య విధానం, ఆర్థిక సుస్థిరతలను పరిశీలిస్తుందని వివరించింది. ఈ-రుపీ స్పెసిఫిక్ ఫీచర్స్, బెనిఫిట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు పేర్కొంది. 


Updated Date - 2022-10-07T22:30:18+05:30 IST