RBI రేట్ల పెంపు ఆశ్చర్యానికి గురిచేసింది: Nirmala Sitharaman

ABN , First Publish Date - 2022-05-09T02:18:52+05:30 IST

ముంబై : వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

RBI రేట్ల పెంపు ఆశ్చర్యానికి గురిచేసింది: Nirmala Sitharaman

ముంబై : వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర బ్యాంక్ RBI తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman వ్యాఖ్యానించారు. రెండు ద్రవ్య విధాన సమీక్షల మధ్య రేట్ల పెంపు నిర్ణయం వెలువడడం ఇందుకు కారణమని ఆమె చెప్పారు. వడ్డీ రేట్ల పెంపు ప్రకటన వచ్చిన సమయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఎప్పుడైనా జరగాల్సిందే కదా అని జనాలు భావించారని అన్నారు. ముంబైలో శనివారం జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేటు ఎక్స్ లెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించిన తీరుకుగానూ నిర్మలా సీతారామన్ కు అవార్డ్ దక్కింది. ప్రభుత్వ మౌలికరంగ పెట్టుబడులకు సంబంధించి ఆర్బీఐ నిర్ణయం ప్రభావం చూపుతుందని భావించడంలేదన్నారు. తగ్గింపు రేటుతో క్రూడ్ ఆయిల్ విక్రయిస్తున్న రష్యా నుంచి కొనుగోలు చేయడం సబబేనన్నారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ గత బుధవారం ప్రకటన చేసింది. క్యాష్ రిజర్వ్ రేసియో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 

Read more