మార్కెట్లకు కీలకంగా... ఆర్‌బీఐ పాలసీ * రేపటినుంచి ద్రవ్యవిధాన సమావేశం

ABN , First Publish Date - 2022-06-06T01:18:49+05:30 IST

ఆర్‌బీఐ పాలసీ, గ్లోబల్ ట్రెండ్‌లు, విదేశీ నిధుల తరలింపు తదితర అంశాలు వచ్చే వారం మార్కెట్లకు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మార్కెట్లకు కీలకంగా... ఆర్‌బీఐ పాలసీ  * రేపటినుంచి ద్రవ్యవిధాన సమావేశం

ముంబై : ఆర్‌బీఐ పాలసీ, గ్లోబల్ ట్రెండ్‌లు, విదేశీ నిధుల తరలింపు తదితర అంశాలు వచ్చే వారం మార్కెట్లకు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ మార్కెట్లు ఇటీవల పుంజుకుంటున్నప్పటికీ... పెరుగుతున్న ద్రవ్యోల్బణం,  భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ పాలసీ కఠినతరం వంటి దీర్ఘకాలిక సవాళ్ల నేపథ్యంలో ఈ పాలసీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయంతో పాటు గ్లోబల్ సంకేతాలు, విదేశీ నిధుల తరలింపు, ముడిచమురు ధరలు ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను నడిపించవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఎర్నింగ్స్ సీజన్‌లో వెనుకబడి ఉన్నందున, జూన్ రేపటి(జూన్ 6) నుండి ఎనిమిదో తేదీవరకు జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంపై మార్కెట్ నిపుణులు, ట్రేడర్లు దృష్టి సారించారు. ఇక... గ్లోబల్ మార్కెట్ల పనితీరు, క్రూడ్‌ పరిణామాలు కూడా దృష్టిలో ఉంటాయని ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇక... చైనా, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నందున రాబోయే వారంలో అన్ని చర్చల్లో ద్రవ్యోల్బణం కీలక కారకంగా ఉంటుందని సామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యేషా పేర్కొన్నారు. ఇక... దేశీయ మార్కెట్లకు సంబంధించి... RBI MPC సమావేశం ఫలితం... మరో ప్రధాన పరిణామంగా మారుతుందని భావిస్తున్నారు.  RBI రేట్లను 25bps నుండి 35bps, ఫెడ్ 50bps పెంచుతుందని అంచనాలున్నాయి. కాగా... వృద్ధి, ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకుల ఆలోచనలు మార్కెట్ ధోరణికి ముఖ్యమైన నిర్ణయాధికారమవుతాయని, సెంట్రల్ బ్యాంకులు తమ విధానాన్ని కఠినతరం చేయాలని నిర్ణయించినపక్షంలో... మార్కెట్ మూడ్ బేరిష్‌గా మారవచ్చునని భావిస్తున్నారు.

Updated Date - 2022-06-06T01:18:49+05:30 IST