లాక్‌డౌన్‌ సరిపోదు: రఘురామ్‌ రాజన్‌

ABN , First Publish Date - 2020-03-27T06:23:37+05:30 IST

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ సరిపోకపోవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు ఒంటరిగా...

లాక్‌డౌన్‌ సరిపోదు: రఘురామ్‌ రాజన్‌

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ సరిపోకపోవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు ఒంటరిగా ఉండకుండా ఒక్క చోటనే ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఎంతో ఆందోళనకరమైనదని చెప్పారు. ఇలాంటి తరుణంలో ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నిరోధించడం కష్టం కావొచ్చని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని రాజన్‌ అన్నారు. ఇవే కోవిడ్‌పై ప్రభుత్వం చేసే యుద్ధానికి అవరోధంగా మారుతున్నాయని చెప్పారు. నగదు బదిలీతోపాటు ఆహారం, పేద ప్రజలకు సరుకులు అందించడం ఇబ్బందికరమేనని తెలిపారు.

Updated Date - 2020-03-27T06:23:37+05:30 IST