హెల్త్‌కేర్‌కు నెల రోజుల్లోనే రుణాలు

ABN , First Publish Date - 2021-05-08T08:40:53+05:30 IST

హెల్త్‌కేర్‌ రంగ అభివృద్ధి కోసం తమ నుంచి అందుకునే రూ.50,000 కోట్ల ప్రత్యేక రుణ పథకాన్ని బ్యాంకులు నెల రోజుల్లో పూర్తి చేయాలని

హెల్త్‌కేర్‌కు నెల రోజుల్లోనే రుణాలు

బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు


ముంబై: హెల్త్‌కేర్‌ రంగ అభివృద్ధి కోసం తమ నుంచి అందుకునే రూ.50,000 కోట్ల ప్రత్యేక రుణ పథకాన్ని బ్యాంకులు నెల రోజుల్లో పూర్తి చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అమల్లో  ఉంటుంది. ఈ పథకం కింద ఆర్‌బీఐ నాలుగు శాతం వడ్డీ రేటుతో బ్యాంకులకు రుణాలు సమకూరుస్తుంది. బ్యాంకులు ఈ రుణాలను వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు, దిగుమతి/సరఫరా కంపెనీలు లేదా ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల కంపెనీలకు నెల రోజుల్లో రుణాలుగా ఇవ్వాలి. ఈ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణిస్తారు. 

Updated Date - 2021-05-08T08:40:53+05:30 IST