విదేశీ కరెన్సీ depositకు OK... RBI నిర్ణయం * ‘రూపాయి’ తగ్గుదలే కారణం

ABN , First Publish Date - 2022-05-12T21:32:52+05:30 IST

అమెరికా dollarతో Rupee మారకం విలువ ప్రస్తుతం 77.55 వద్ద ట్రేడవుతోంది. కాగా... రూపాయి విలువలో క్షీణతను ఎదుర్కొనేందుకు... RBI(భారతీయ రిజర్వ్ బ్యాంక్) విస్తృత శ్రేణి పాలసీలను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

విదేశీ కరెన్సీ depositకు OK...  RBI నిర్ణయం   * ‘రూపాయి’ తగ్గుదలే కారణం

ముంబై : అమెరికా dollarతో Rupee మారకం విలువ ప్రస్తుతం  77.55 వద్ద ట్రేడవుతోంది. కాగా... రూపాయి విలువలో  క్షీణతను ఎదుర్కొనేందుకు... RBI(భారతీయ రిజర్వ్ బ్యాంక్) విస్తృత శ్రేణి పాలసీలను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. డాలర్ డిపాజిట్లను సేకరించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అనుమతించడం, విదేశీ పెట్టుబడిదారులకు దేశీయ రుణపరిమితిని పెంచడం, అధిక సుంకాలతో నిర్దిష్ట దిగుమతులను నిరుత్సాహపరచడం, డాలర్ ఆదాయాన్ని తిరిగి తీసుకురావడానికి ఎగుమతిదారులను ప్రోత్సహించడం వంటి ప్రతిపాదనలున్నాయి. గతంలో... 2013 లో US ఫెడరల్ రిజర్వ్ మిగులు లిక్విడిటీని ఉపసంహరించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.


రూపాయి విలువలో తీవ్ర తరుగుదలను ఎదుర్కొంటున్న RBI, హెడ్జింగ్ ఖర్చులపై రాయితీలతో విదేశీ కరెన్సీ డిపాజిట్లను అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి, బ్యాంకులు ఈ వెసులుబాటు ద్వారా దాదాపు $35 బిలియన్ల వరకు సమీకరించాయి. ఎగుమతిదారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోకుండా RBI వ్యవహరించవచ్చని వినవస్తోంది. కాగా... అవసరమైనపక్షంలో...  డాలర్లను వేగంగా వెనక్కు తీసుకురావాలని ఎగుమతిదారులను కోరవచ్చునన్న అభిప్రాయాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. దేశీయ మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో ఇటీవలి అనిశ్చితి, ద్రవ్యోల్బణ పోకడలు. వాస్తవానికి, US ద్రవ్యోల్బణం డేటా నిన్న(బుధవారం) ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది, ఇది US ఫెడ్ రేటులో ప్రస్తుత 0.75-1.0 శాతం నుండి 50 బేసిస్ పాయింట్ల తదుపరి పెంపుదలకు బలమైన సందర్భాన్నందిస్తోందని చెబుతున్నారు. "కరెన్సీ యొక్క పెద్ద తరుగుదలను అరికట్టడానికి సెంట్రల్ బ్యాంక్, దాని నిల్వలలో కొన్నింటిని ఉపయోగించుకోవడంతోపాటు RBI తన నిల్వలను $600 బిలియన్ల మార్క్ కంటే తక్కువగా ఉంచడం వెసులుబాటుగా లేదని ఫారెక్స్ & బులియన్ విశ్లేషకుడు గౌరంగ్ సోమయ్య అభిప్రాయపడ్డారు.


కాగా ‘ఆర్‌బీఐ చురుకుగా జోక్యం చేసుకుంటుందని  ఆశిస్తున్నాం. ఏదో ఒక సమయంలో, భవిష్యత్తు అనిశ్చితుల కోసం బఫర్‌ను సృష్టించడానికి దాని ForeX నిల్వలను మళ్లీ నిర్మించడం ప్రారంభిస్తుంది’ అని సోమయ్య పేర్కొన్నారు. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం సహా ఫారెక్స్ నిల్వల విలువలో తరుగుదల కారణంగా ఇప్పటికే దేశంలోని ఫారెక్స్ నిల్వలు 640 బిలియన్ డాలర్ల నుండి 600 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 

Read more