మార్కెట్‌కు ఆర్‌బీఐ జోష్‌

ABN , First Publish Date - 2020-08-07T06:37:05+05:30 IST

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో ఉత్సాహం పెంచాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, రియల్టీ, హెల్త్‌కేర్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో గురువారం మార్కెట్లు ఎగబాకాయి...

మార్కెట్‌కు ఆర్‌బీఐ జోష్‌

  • సెన్సెక్స్‌ 362 పాయింట్లు అప్‌ 
  • 11,200 ఎగువ స్థాయికి నిఫ్టీ 

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో ఉత్సాహం పెంచాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, రియల్టీ, హెల్త్‌కేర్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో గురువారం మార్కెట్లు ఎగబాకాయి. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ ఒక దశలో 558 పాయింట్ల వరకు పెరిగింది. చివరికి 362.12 పాయింట్ల లాభంతో 38,025.45 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ 98.50 పాయింట్లు ఎగబాకి 11,200.15 వద్ద స్థిరపడింది. బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.99 శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 22 లాభాల్లో, 8 నష్టాల్లో ముగిశాయి. టాటాస్టీల్‌ షేరు 3.82 శాతం పెరుగుదలతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌ 2 శాతం పైగా పుంజుకున్నాయి.  

Updated Date - 2020-08-07T06:37:05+05:30 IST