Tamil Nadu: పన్నీర్‌సెల్వం స్థానాన్ని ఉదయ్‌కుమార్‌తో భర్తీ చేసిన అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2022-07-19T21:37:53+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వాన్ని (Panneerselvam) పార్టీ నుంచి బహిష్కరించడంతో

Tamil Nadu: పన్నీర్‌సెల్వం స్థానాన్ని ఉదయ్‌కుమార్‌తో భర్తీ చేసిన అన్నాడీఎంకే

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వాన్ని (Panneerselvam) పార్టీ నుంచి బహిష్కరించడంతో ఖాళీ అయిన అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానాన్ని అన్నాడీఎంకే (AIADMK) భర్తీ చేసింది. ఆ స్థానంలో మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ్‌కుమార్ (RB Udhayakumar)ను నియమించింది. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(Edappadi K Palaniswami) తెలిపారు.


ఈ నెల 17న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తిరుమంగళం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయ్‌కుమార్‌ను డిప్యూటీ లీడర్‌గా ఎన్నుకున్నట్టు పళనిస్వామి తెలిపారు. అలాగే, లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా అగ్రి ఎస్ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 11న పన్నీర్‌సెల్వాన్ని అన్నాడీఎంకే బహిష్కరించింది. 

Updated Date - 2022-07-19T21:37:53+05:30 IST