కోవిడ్‌పై పోరు కోసం.. 10 మిలియన్ డెట్టాల్ సబ్బుల పంపిణీ

ABN , First Publish Date - 2020-03-28T00:37:57+05:30 IST

కోవిడ్-19పై పోరుకు బ్రిటిష్ కన్జుమర్ గూడ్స్ దిగ్గజం ఆర్‌బి ముందుకొచ్చింది. డెట్టాల్ సబ్బులు,

కోవిడ్‌పై పోరు కోసం.. 10 మిలియన్ డెట్టాల్ సబ్బుల పంపిణీ

న్యూఢిల్లీ: కోవిడ్-19పై పోరుకు బ్రిటిష్ కన్జుమర్ గూడ్స్ దిగ్గజం ఆర్‌బి ముందుకొచ్చింది. డెట్టాల్ సబ్బులు, హార్పిక్ క్లీనర్లు తయారుచేసే ఈ సంస్థ 32 మిలియన్ పౌండ్లు కేటాయించింది. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. భారత్‌లో 10 మిలియన్ డెట్టాల్ సబ్బులను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంస్థలు, ఆరోగ్య, శానిటేషన్ వర్కర్లకు లైజాల్, హార్పిక్ టాయిలెట్ క్లీనర్లను పంపిణీ చేయనున్నట్టు వివరించింది. హెల్త్ వర్కర్లకు 3.5 మిలియన్ల ఎన్95 మాస్కులను కూడా అందించనున్నట్టు తెలిపింది. 


వినియోగదారుల జీవితాలను రక్షించే ఉత్పత్తులు తయారుచేయడంలో తమకు 200 ఏళ్ల చరిత్ర ఉందని ఆర్‌బి తెలిపింది. పరిశుభ్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలోను, కోవిడ్19పై పోరాడడంలోను తమ బ్రాండ్లది కీలక పాత్ర అని ఆర్‌బీ గ్లోబల్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు.


కోవిడ్-19 కంటెన్జెన్సీ ఫండ్ కింద రూ. 150 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ రోజు ఐటీసీ ప్రకటించగా, హిందూస్థాన్ యూనిలీవర్ ఇప్పటికే రూ. 100 కోట్లు ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు సబ్బులు, శానిటైజర్లు తయారు చేస్తుండడం గమనార్హం. 

Updated Date - 2020-03-28T00:37:57+05:30 IST