ప్రకాశం జిల్లాలో ఆర్ అండ్ బి స్థలం ఇళ్ల స్థలాలుగా..

ABN , First Publish Date - 2020-05-26T22:28:23+05:30 IST

వెలిగొండ్లలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్ అండ్ బి స్థలం సిద్ధం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ఆర్ అండ్ బి స్థలం  ఇళ్ల స్థలాలుగా..

ప్రకాశం జిల్లా: వెలిగొండ్లలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్ అండ్ బి స్థలం సిద్ధం చేస్తున్నారు. దీంతో వెలిగొండ్ల హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1966లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్‌ను తొలగించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ స్థలాలు చాలా ఉండగా.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ ఆర్ అండ్ బి వసతి గృహాన్ని 64 పంచాయతీలకు, అనేక ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. అయితే ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఇదే అదనుగా దానిని పడగొట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట ఉండే ఈ స్థలంలో పేదలకు ఇవ్వడంపట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-05-26T22:28:23+05:30 IST