రేమండ్... రికార్డులే రికార్డులు...

ABN , First Publish Date - 2021-11-30T01:18:26+05:30 IST

దేశీయ దుస్లుల తయారీ సంస్థ, ఫాబ్రిక్ రంగంలో ప్రముఖ బ్రాండ్ ‘రేమండ్’... ఐదు సెషన్ల నుంచి వేగంగా పరుగెడుతోంది.

రేమండ్... రికార్డులే రికార్డులు...

హైదరాబాద్ : దేశీయ దుస్లుల తయారీ సంస్థ, ఫాబ్రిక్ రంగంలో ప్రముఖ బ్రాండ్ ‘రేమండ్’... ఐదు సెషన్ల నుంచి వేగంగా పరుగెడుతోంది. ఈ రోజు ఇంట్రాడేలో 13 శాతం పెరిగిన రేమండ్ షేర్లు... ఇంట్రాడేలో రూ. 673 ధరకు  చేరాయి. దీంతో ఫ్రెష్ 52 వారాల గరిష్టాన్ని తాకినట్లైంది.  గత వారం రోజుల్లో షేరు ధర 33 శాతం పెరగగా, వచ్చే నెలలో ఏర్పాటు కానున్న బోర్డ్ సమావేశాన్ని ఈ ర్యాలీకి కారణంగా చెబుతున్నారు. ఆ బోర్డ్ సమావేశంలో సంస్థ... రేమండ్ అప్పారెల్, రేమండ్‌గా విడివిడిగా ఏర్పాటు కావడంపై స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివనాలపే నవంబరు  24 నే బహిర్గతమైన నేపధ్యంలో... అప్పటినుంచి కంపెనీ షేర్లు పెరుగుతూనే వస్తున్నాయి. రేమండ్ అప్పరెల్ , సిజర్స్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రేమండ్ లైఫ్ స్టైల్‌గా సంస్థ విడిపోనుంది. ఈ ప్రక్రియ మొత్తం 2022 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేనాటికి(అంటే ఇంకో నాలుగు నెలల్లోనే) ముగియనుంది. గత మూడు నెలలుగా 70 శాతం రేమండ్ షేరు ధర పెరగగా, మొత్తం కంపెనీ వ్యాపారంలో టెక్స్‌టైల్ వ్యాపారం 47 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో రేమండ్ 214 శాతం వృద్ధితో రూ. 722 కోట్ల లాభాన్నార్జించింది. 

Updated Date - 2021-11-30T01:18:26+05:30 IST