రామాయపట్నం పోర్టు టెండర్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిన మారిటైమ్ బోర్డు

ABN , First Publish Date - 2020-09-18T21:17:41+05:30 IST

అమరావతి: రామాయపట్నం పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపారు.

రామాయపట్నం పోర్టు టెండర్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిన మారిటైమ్ బోర్డు

అమరావతి: రామాయపట్నం పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపారు. పోర్టు అభివృద్ధి కోసం చేపట్టనున్న కాంట్రాక్టు విలువను 2169 కోట్లుగా అంచనా వేశారు. 5.05 కిలోమీటర్ల బ్రేక్ వాటర్స్‌తో పాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశ పోర్టు నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందింది. ఈ అంశాలతో కూడిన టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు ఏపీ మారిటైమ్ బోర్డు పంపించింది.

Updated Date - 2020-09-18T21:17:41+05:30 IST