ఆర్‌యూలో ఘనంగా సైన్స్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2021-02-28T05:26:45+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీలో సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆర్‌యూలో ఘనంగా సైన్స్‌ దినోత్సవం

కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 27: రాయలసీమ యూనివర్సిటీలో సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం బయో కెమిస్ట్రి విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వర్సిటీ ప్రిన్సిపాల్‌ ఎస్‌. మధుసూదనవర్మ, రిజిస్ట్రార్‌ సుందరానంద పుచ్చా, రెక్టార్‌ విశ్వనాథరెడ్డి హాజరై మాట్లాడారు. సైంటిస్టు అండ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ (ఏఆర్‌సీఐ) ప్రొఫెసర్‌ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు  కొత్త ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బయోకెమిస్ట్రి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సెంతిల్‌ కుమార్‌, రాజగోపాల్‌, డాక్టర్‌ జీవి.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.



డోన్‌(రూరల్‌): పట్టణంలోని పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను డిప్యూటీ డీఈవో నాగరాజు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:26:45+05:30 IST