రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దు: రజత్‌కుమార్

ABN , First Publish Date - 2020-06-05T00:03:27+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దు: రజత్‌కుమార్

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం వాడివేడిగా జరిగింది. తెలంగాణ తరపున రజత్‌కుమార్‌ వాదనలు విన్పించారు. కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని, వాటినే కొనసాగిస్తున్నామని చెప్పారు. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని రజత్‌కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T00:03:27+05:30 IST