రాయలసీమ రైతు ద్రోహి జగన్‌

ABN , First Publish Date - 2022-05-23T05:58:13+05:30 IST

సీఎం జగన్‌ రాయలసీమ రైతు ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

రాయలసీమ రైతు ద్రోహి జగన్‌

మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి


గోనెగండ్ల, మే 22:
సీఎం జగన్‌ రాయలసీమ రైతు ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం నెరుడుప్పల గ్రామంలో టీడీపీ గౌరవసభ, బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం టీడీపీ నిధులను విడుదల చేస్తే వాటిని నిలిపివేసి రాయలసీమ రైతుల ద్రోహిగా జగన్‌ నిలిచారని అన్నారు. నిత్యవసర వస్తువలు ధరలు పెంచి పేదలకు తీరని అన్యాయం చేశారని, విద్యుత్‌ కోతలతో పాటు విద్యుత్‌ బిల్లులు, బస్సు చార్జీలు పెంచారని అన్నారు. గడప గడప కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులకు నిరసనలు ఎదురవుతున్నాయని, దీంతో బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ సీఎం అయి మూడేళ్లు అయినా ఇంత వరకు ఏ గ్రామంలోనూ అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు. అనంతరం బాదుడే బాదుడులో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, లాంతర్‌, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్యనాయుడు, నెరుడుప్పల రామాంజినేయులు, శ్రీనివాసులు, పెద్దయ్య, రాజశేఖర్‌, ఉల్లగడ్డల రాముడు, ఎర్రబాడు శ్రీనివాసులు, కొత్తింటి ఫకృద్దీన్‌, రంగస్వామినాయుడు, ఐరన్‌బండ బాషా, మునిస్వామి టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:58:13+05:30 IST