రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం పివి నరసింహారావుపై కవితల పోటీ

ABN , First Publish Date - 2020-08-31T06:32:10+05:30 IST

రాయలసీమ సాంస్కృతిక వేదిక ప్రతి సంవత్సరం మహా కవి సమ్మేళనం నిర్వహిస్తుంది. సీమ సాంస్కృతిక అంశాల...

రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం పివి నరసింహారావుపై కవితల పోటీ

రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం 

రాయలసీమ సాంస్కృతిక వేదిక ప్రతి సంవత్సరం మహా కవి సమ్మేళనం నిర్వహిస్తుంది. సీమ సాంస్కృతిక అంశాల నేపథ్యంగా ఈ నాలుగవ ‘‘రాయలసీమ సాంస్కృతిక కవిసమ్మేళనాన్ని’’ సెప్టెంబర్‌ 6 ఉదయం 10 గంటలకు అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తుంది. సీమ భాష, కళలు, సంప్రదాయాలు, జానపదం, చారిత్రక ఔన్నత్యం తదితర సాంస్కృతిక అంశాలపై కవులు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. కవిత సంక్షిప్తంగా ఉండాలి. ఈ కవిసమ్మేళనం కోసమే ప్రత్యేకంగా కవిత రాయాలి. కవితలను సంకలనంగా తీసుకొస్తాం. 

అప్పిరెడ్డి హరినాథరెడ్డి

పివి నరసింహారావుపై కవితల పోటీ

కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ సాహితీ కిరణం సౌజన్యంతో నిర్వహించే కవితలపోటీకి పి.వి.నరసింహారావు జీవితం - సాహిత్యం అంశంపై కవితలను అక్టోబర్‌ 31 లోపు చిరునామా: కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌-సాహితీ కిరణం కవితల పోటీ, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌-3, హైదరాబాద్‌-500102, ఫోన్‌: 040-29550181 కు పంపాలి.

పొత్తూరి సుబ్బారావు


Updated Date - 2020-08-31T06:32:10+05:30 IST