Tirupati: రాయల చెరువు వద్ద మొదలైన వర్షం

ABN , First Publish Date - 2021-11-22T17:52:11+05:30 IST

జిల్లాలోని రాయల చెరువు వద్ద మళ్లీ వర్షం మొదలైంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు చెరువులో 4 అంగుళాల మేర నీరు తగ్గింది.

Tirupati: రాయల చెరువు వద్ద మొదలైన వర్షం

తిరుపతి: జిల్లాలోని రాయల చెరువు వద్ద మళ్లీ వర్షం మొదలైంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు చెరువులో 4 అంగుళాల మేర నీరు తగ్గింది. ఇసుక ఎంత వేసినా కొట్టుకుపోతుండటంతో అధికారులు ఇంటి నిర్మాణానికి వినియోగించే తెల్ల కంకర రాళ్ళ మూటలను గండి పడిన ప్రాంతంలో వేయిస్తున్నారు. 60 అడుగుల లోతు ఉన్న చెరువు కట్ట, అడుగు భాగంలో 120 అడుగులుకట్ట, పై భాగంలో 45 అడుగుల వెడల్పు కట్ట ఉంది. కింద భాగంలో 3 అంగుళాల వెడల్పుతో నీరు వెలుపలకు వస్తోంది. 120 అడుగులున్న కట్ట కింద భాగం దెబ్బ తినటం జరగదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇటీవల ఒక అన్యమతానికి చెందిన వారు కబ్జా చేసిన స్థలంలో ఉన్న తూములను పునరుద్ధరించి ఔట్ ఫ్లో పెరిగేటట్టు చేస్తే చాలు రాయల చెరువు ఏమీ కాదని జనం తెలిపారు. రాయల చెరువు  కబ్జాల నేపథ్యంలోనే ఈ దుస్థితి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాయల చెరువు ప్రమాద అంచుల్లో ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి  5 హెలికాఫ్టర్లు చేరుకున్నాయి. 

Updated Date - 2021-11-22T17:52:11+05:30 IST