రాయచూరు జిల్లాలో చిరుత కలకలం

ABN , First Publish Date - 2022-07-02T15:52:28+05:30 IST

జిల్లాలోని మాన్వి తాలూకా నీరమాన్వి గ్రామ సమీపంలోని గుట్టపై శుక్రవారం సాయంత్రం చిరుత కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. నెల రోజుల

రాయచూరు జిల్లాలో చిరుత కలకలం

రాయచూరు(బెంగళూరు), జూలై 1: జిల్లాలోని మాన్వి తాలూకా నీరమాన్వి గ్రామ సమీపంలోని గుట్టపై శుక్రవారం సాయంత్రం చిరుత కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. నెల రోజుల క్రితం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా దాన్ని పట్టేందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జాడలేని చిరుత శుక్రవారం వారి కంట పడినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా నీరమాన్వి గుట్టలో రెండు చిరుతలు నివాసం ఉంటున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఉన్నతాధికారుల సహాయంతో పెద్దఎత్తున కార్యచరణకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2022-07-02T15:52:28+05:30 IST