పాకిస్తాన్ ఆర్మీలో ఉంటూ భారత్‌కు సహాయం చేసిన సీక్రెంట్ ఏజెంట్ గురించి తెలుసా?.. రియల్ లైఫ్ 'ఏక్ థా టైగర్' ఇతనే..

ABN , First Publish Date - 2022-02-01T06:39:07+05:30 IST

దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడే వీరులకు ఎంతో గౌరవం లభిస్తుంది. కానీ కొందరికి ఆ అదృష్టం కూడా ఉండదు. అలాంటి వారినే సీక్రెంట్ ఏజెంట్(గూఢాచారి) అంటారు. వారు దేశం కోసం శత్రు స్థావరాలలో మారువేషంలో వెళ్లి అతి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. వారు పట్టుబడితే దేశ ప్రభుత్వం వారిని పట్టించుకోదు. అయినా సరే.. కేవలం దేశకోసం తమ జీవితాన్ని, అంత కంటే ముఖ్యమైన తమ గుర్తింపుని...

పాకిస్తాన్ ఆర్మీలో ఉంటూ భారత్‌కు సహాయం చేసిన సీక్రెంట్ ఏజెంట్ గురించి తెలుసా?.. రియల్ లైఫ్ 'ఏక్ థా టైగర్' ఇతనే..

దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడే వీరులకు ఎంతో గౌరవం లభిస్తుంది. కానీ కొందరికి ఆ అదృష్టం కూడా ఉండదు. అలాంటి వారినే సీక్రెంట్ ఏజెంట్(గూఢాచారి) అంటారు. వారు దేశం కోసం శత్రు స్థావరాలలో మారువేషంలో వెళ్లి అతి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. వారు పట్టుబడితే దేశ ప్రభుత్వం వారిని పట్టించుకోదు. అయినా సరే.. కేవలం దేశకోసం తమ జీవితాన్ని, అంత కంటే ముఖ్యమైన తమ గుర్తింపుని వారు ఫణంగా పెట్టి అతి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటారు. 


అలాంటి ఒక గొప్ప వీరుడే రవీంద్ర కౌశిక్. ఆయన 1952లో రాజస్థాన్‌లో జన్నించారు. ఆయన 1972లో ఒక కాలేజీ నాటకంలో గూడాచారిగా వేషం వేశారు. అందులో ఆయన నటన చూసిన ఒక ఉన్నత సైనికాధికారి ఎంతో మెచ్చుకున్నాడు. చదువు పూర్తిచేసుకున్నాక ఢిల్లీకి వచ్చి తనను కలవమన్నారు. అలా రవీంద్ర కౌశిక్ భారత గూడాచార సంస్ధ 'రా'(RAW - Research and Analysis Wing)లో ఉద్యోగం పొందారు. అక్కడ ఆయన శిక్షణలో ఉర్దూ, పంజాబీ భాషలతో పాటు.. ఇస్లాం మత సంప్రదాయాల గురించి నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన అహ్మద్ నబీ షాకిర్ అని పేరు మార్చకొని పాకిస్తాన్‌లో ప్రవేశించారు.




ఆ సమయంలో 1971 యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్.. తన ఓటమికి ప్రతికారం తీర్చకోవాలని భారత్‌ను దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు పన్నేది. రవీంద్ర కౌశిక్ ఒక ముస్లింగా పేరు మార్చుకొని పాకిస్తాన్‌లోని ఒక కాలేజీలో విద్యార్థిగా చేరారు. ఆ తరువాత ఆయన పాకిస్తాన్ ఆర్మీలో చేరి అతి తక్కువ సమయంలోనే తన ప్రతిభతో మేజర్ ర్యాంక్ సంపాదించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. రవీంద్ర పాక్ సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కుమార్తెను వివాహం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్ ఆర్మీ పన్నాగాల గురించి భారత్‌కు రహస్యంగా సమాచారం అందించేవారు.


అలా ఒకసారి ఆయన అందించిన సమాచారంతో 20 వేల మంది సైనికుల ప్రాణం కాపాడారు. ఈ విషయం భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారి యం.కె ధర్ తన పుస్తకం 'మిషన్ టు పాకిస్తాన్'లో ప్రస్తావించారు. 1979 నుంచి 1983 వరకు రవీంద్ర దేశానికి చేసిన సేవలకు గుర్తిస్తూ అప్పటి భారత్ హోం మినిస్టర్ ఆయనకు 'టైగర్' అనే బిరుదునిచ్చారు. 


కానీ కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. 1983లో రవీంద్ర కౌశిక్‌ను పాక్ ఆర్మీ అధికారులు పట్టుకున్నారు. ఆయన మారువేషం బయటపడింది. 1985లో పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. కానీ ఆ మరణ శిక్షను అమలు పరచకుండా ఆయనను పాక్ ఆర్మీ అధికారులు జైలులో చిత్రహింసలు పెట్టేవారు. భారత సైన్యం గురించి సమాచారం చెప్పమని వేధించే వారు. అలా ఆయన ఎన్నో సంవత్సరాలు గడిపాక 2001 నవంబర్‌లో ఆయన గుండెపోటుతో జైలులోనే మరణించారు. ఆయన నిజజీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి.


రవీంద్ర కౌశిక్ మరణించాక భారత ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోలేదు. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు మీడియా ముందు చెప్పారు. 


Updated Date - 2022-02-01T06:39:07+05:30 IST