దివాళీ రవ్వలడ్డు

ABN , First Publish Date - 2020-11-13T18:22:33+05:30 IST

బొంబాయి రవ్వ - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, నెయ్యి - 50 గ్రా., జీడిపప్పు, కిస్‌మిస్‌ - పది చొప్పున, పంచదార - ముప్పావుకప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.

దివాళీ రవ్వలడ్డు

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, నెయ్యి - 50 గ్రా., జీడిపప్పు, కిస్‌మిస్‌ - పది చొప్పున, పంచదార - ముప్పావుకప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.


తయారుచేసే విధానం: ఒక బౌల్‌లో రవ్వ, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి రెండు గంటలు పక్కనుంచాలి. కడాయిలో నెయ్యివేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేగించాలి. అదే కడాయిలో రవ్వ, కొబ్బరితురుము మిశ్రమం వేసి చిన్నమంటపై దోరగా 20 నిమిషాలు వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో పంచదార వేసి తగినంత నీరు కలిపి ఒక తీగపాకం వచ్చేవరకు తిప్పి మంట తీసెయ్యాలి. పాకంలో వేగించిన రవ్వ మిశ్రమం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి గోరువెచ్చగా అయ్యాక యాలకుల పొడి కలిపి రవ్వలడ్లు చుట్టుకోవాలి. ఇవి రెండు మూడు రోజుల వరకు గట్టిపడకుండా వుంటాయి. 

Updated Date - 2020-11-13T18:22:33+05:30 IST