Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 13:16:10 IST

మాస్ మహారాజా బర్త్‌డే ‘థమాకా’

twitter-iconwatsapp-iconfb-icon
మాస్ మహారాజా బర్త్‌డే థమాకా

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ‘పెళ్ళిసందD’ ఫేమ్ శ్రీలీల, ఫరియా అబ్దుల్లా కథానాయికలుగా నటిస్తుండగా.. ఇషా రెబ్బా ప్రత్యేక గీతంలో నర్తించబోతోంది. రవితేజ 69వ చిత్రంగా రూపొందుతోంది. నేడు ( బుధవారం) రవితేజ పుట్టిన రోజు సందర్బంగా ‘ధమాకా’ చిత్రం ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. రవితేజ డ్యాన్స్ చేస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు నిర్మాతలు. 


ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ విడుదలవుతుండగా, మార్చ్ 25న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం రిలీజ్ కాబోతోంది. సరిగ్గా ఒక నెల  గ్యాప్ తో రెండు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో.. ‘ధమాకా’ చిత్రాన్ని కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ధమాకాతో మాస్ మహారాజా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International