Jun 11 2021 @ 12:29PM

సెట్స్ మీదకి రాబోతున్న రవితేజ - శరత్ మూవీ..!

మాస్ మహారాజ రవితేజ, శరత్ దర్శకత్వంలో నటించనున్న సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి రాబోతోందని సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఇందులో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా  ఎంపికైంది. 'క్రాక్' తర్వాత ఫుల్ ఫాంలోకి వచ్చిన రవితేజ వరుసగా ప్రాజెక్ట్స్‌ లైనప్ చేసుకుంటున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న 'ఖిలాడి' దాదాపు చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. రవితేజ డ్యూల్ రోల్‌లో నటిస్తున్న ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమాను ప్రారంభించబోతున్నాడట. ఈ సినిమా ఫస్టులుక్, టైటిల్ సాంగ్, థీమ్ సాంగ్ సహా ప్రతీది ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని దర్శకుడు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు.