Aug 15 2021 @ 14:07PM

శ్రీను వైట్లతో రవితేజ ?

శ్రీను వైట్లతో మాస్ మహారాజ రవితేజ సినిమా చేయనున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రవితేజ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఖిలాడీ' చిత్రంలో నటిస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ హీరోయిన్స్‌గా.. అనసూయ, అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ ఇనిర్మిస్తోంది. అలాగే నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో కూడా మాస్ మహరాజా నటిస్తున్నాడు. ఈ చిత్రాల తర్వాత శ్రీనివైట్లతో ఓ ప్రాజెక్ట్ చేడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవలే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయని అంటున్నారు. రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోని' ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక వీరి కాంబినేషన్‌లో 'నీకోసం', 'దుబాయ్ శీను', 'వెంకీ' వచ్చిన సంగతి తెలిసిందే. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణుతో 'డి అండ్ డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.