Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 15 May 2022 15:06:42 IST

Raviteja : తమిళ దర్శకుడితో చిత్రం?

twitter-iconwatsapp-iconfb-icon

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ ను జోరుగా లాగిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). గతేడాది క్రాక్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రవితేజ.. ఈ ఏడాది ‘ఖిలాడి’ (Khiladi) చిత్రంతో పరాజయం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ‘రామారావు అండ్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమవగా.. ‘ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవిలా ఉంటే.. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ .. ఓ ప్రముఖ తమిళ దర్శకుడితో వర్క్ చేయబోతున్నాట్టు వార్తలొస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు బాలాజీ మోహన్ (Balaji mohan).  సిద్ధార్ధ్ హీరోగా తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’  (Love Failure) అనే మూవీని డైరెక్ట్ చేసిన బాలాజీ ..  ఆ తర్వాత ధనుష్ హీరోగా ‘మారి, మారి 2’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ విడుదలై .. మంచి సక్సెస్ సాధించాయి. ఇటీవల బాలాజీ ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. దీని తర్వాత రవితేజతో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కించబోతున్నట్టు టాక్. 


బాలాజీ మోహన్ (Balaji Mohan) చెప్పిన కథకు రవితేజ బాగా ఇంప్రెస్ అయి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) చిత్రంతో తొలి పాన్ ఇండియా చిత్రాన్ని షురూ చేస్తున్న రవితేజ.. బాలాజీ మోహన్ తెరకెక్కించే చిత్రంతో కూడా పాన్ ఇండియా (Pan India) స్థాయిలో రానున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడనుంది. నిజానికి రవితేజకి తమిళ దర్శకులతో చేదు అనుభవాలున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో ‘శంభో శివ శంభో’, శివ దర్శకత్వంలో ‘దరువు, అమ్మ  రాజశేఖర్ దర్శకత్వంలో ‘ఖతర్నాక్’ చిత్రాల్ని చేసిన రవితేజ  ఆ సినిమాలతో పరాజయాలు ఎదుర్కొన్నాడు. మరి బాలాజీ మోహన్ తో అయినా రవితేజ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. రవితేజ కోసం ఓ మాస్ యాక్షన్ స్టోరీ రాసుకున్నాడట బాలాజీ మోహన్. ఇందులో రవితేజ కేరక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement