Abn logo
Oct 18 2020 @ 10:05AM

అధికారిక ప్రకటన.. రవితేజ 'ఖిలాడి'

Kaakateeya

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'ఖిలాడి'. రవితేజ నటిస్తోన్న 67వ చిత్రమిది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో స్టెప్‌ వేస్తున్న రవితేజ, ఆయన చుట్టూ డబ్బులు గాల్లో ఎగురుతున్నాయి. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 


సినిమా ఆదివారం 11 గంటల 55 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభమైంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా "ఖిలాడి సినిమా ఫస్ట్‌లుక్‌. మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది" అని రవితేజ అన్నారు.  "నా తదుపరి చిత్రం మాస్‌ మహారాజా రవితేజతో ఖిలాడి. సరికొత్త పాత్రలో కనిపించనున్నాం. గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. మీ ఆశీర్వాదాలు కావాలి" అని డింపుల్‌ హయతి అన్నారు. "ఖిలాడిలో ఇప్పటి వరకు కనిపించని రవితేజను చూస్తారు. అద్వితీయమైన టాలెంట్‌ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు" కావాలంటూ డైరెక్టర్‌ ట్వీట్‌ చేశారు. 



Advertisement
Advertisement
Advertisement