Abn logo
Aug 5 2020 @ 20:00PM

రవీంద్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయి: నాగరాజు

గుంటూరు: పండుల రవీంద్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు విమర్శించారు. రాజ్యాంగాన్ని అవమానించడం అంటే అంబేడ్కర్ ను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు.రాజ్యాంగంపై గౌరవం ఉన్న ఏ దళితుడు రవీంద్ర లా మాట్లాడారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసమే రవీంద్ర జడ్జీలను కించపరిచేలా మాట్లాడారని దేవతోటి నాగరాజు విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచి, రాజారెడ్డి రాజ్యాంగం అనుసరిస్తే దళితులు తమ గుడిసెకు తామే నిప్పు పెట్టుకున్నట్టే అని దేవతోటి నాగరాజు అన్నారు.  


Advertisement
Advertisement
Advertisement