నేను పోటీలో ఉండటమే పెద్ద విజయంగా భావిస్తున్నా: రవీందర్ సింగ్

ABN , First Publish Date - 2021-12-12T20:45:33+05:30 IST

అధికారపార్టీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని...

నేను పోటీలో ఉండటమే పెద్ద విజయంగా భావిస్తున్నా: రవీందర్ సింగ్

కరీంనగర్: టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కండువాలతో పోలింగ్ బూత్‌లోకి వచ్చారని, పోలీసులు కూడా వారికి వత్తాసు పలకడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. తాను పోటీలో ఉండటమే పెద్ద విజయంగా భావిస్తున్నానన్నారు. తనకు తన ఓటు కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అదే తన విజయంగా భావిస్తానన్నారు. 14 తేదీ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-12T20:45:33+05:30 IST