Abn logo
Jul 8 2020 @ 03:02AM

క్రిష్‌ నిర్మాణంలో రవికాంత్‌ సినిమా?

‘క్షణం’ సినిమాతో దర్శకుడిగా నిరూపిం చుకున్నారు రవికాంత్‌ పేరెపు. తాజాగా ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ సినిమాతో మరోసారి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ నచ్చి రవికాంత్‌కు దర్శకనిర్మాత క్రిష్‌ నుంచి పిలుపు వచ్చిందనీ, క్రిష్‌ నిర్మాణంలో రవికాంత్‌ ఓ సినిమా చేసే అవకాశం ఉందనీ, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయనీ సమాచారం. అయితే దీని గురించి క్రిష్‌ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మోటివేషనల్‌ జానర్‌లో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement