Team Indian off-spinner రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-06-21T13:06:59+05:30 IST

టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది...

Team Indian off-spinner రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ:టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు.‘‘అశ్విన్ కరోనా వల్ల ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని,కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్క్వాడ్‌లో చేరతారని టీంఇండియా వర్గాలు తెలిపాయి. భారత క్రికెట్ జట్టు ఈ నెల 16వతేదీన యూకేకు బయలుదేరి వెళ్లింది. కరోనా సోకడంతో అశ్విన్ విమానంలో యూకేకు వెళ్లలేక పోయారు. జులై 1వతేదీన టెస్టు మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కరోనా వల్ల ఇతను లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ గేమ్‌ను కోల్పోవచ్చునని బీసీసీఐ పేర్కొంది.మిగిలిన జట్టు సభ్యులు ఇప్పటికే లీసెస్టర్‌లో ఉన్నారు. 


బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ల పర్యవేక్షణలో శిక్షణ ప్రారంభించారు. రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్,శ్రేయాస్ అయ్యర్‌లు దక్షిణాఫ్రికాతో టీ20 అసైన్‌మెంట్ ముగించుకుని లండన్ చేరుకున్నారు. వారు మంగళవారం లీసెస్టర్‌కు వెళ్లనున్నారు. జట్టు సభ్యులకు మూడు రోజుల విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఐర్లాండ్-బౌండ్ స్క్వాడ్ జూన్ 23 లేదా 24 న డబ్లిన్‌కు బయలుదేరనుంది.గజ్జల్లో గాయం కారణంగా రాహుల్ ఈసారి పర్యటనకు దూరం కానున్నారు.


Updated Date - 2022-06-21T13:06:59+05:30 IST