Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ఘనత సాధించిన మూడో ఇండియన్‌గా అశ్విన్

కాన్పూరు: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను వెనక్కి నెట్టేశాడు. న్యూజిలాండ్‌తో కాన్పూరులో జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజైన నేడు కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ (52)ను బౌల్డ్ చేసిన అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 


తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా హర్భజన్ సింగ్ (417) రికార్డును బద్దలుగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇండియన్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, కపిల్ దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు. 418 వికెట్లతో అశ్విన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు సాధించగా, కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు పడగొట్టాడు.   

Advertisement
Advertisement