Sep 8 2021 @ 08:32AM

రవితేజ - త్రినాధరావు నక్కిన మూవీ అక్టోబర్ 1 నుంచి సెట్స్ మీదకి..?

రవితేజ - త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్ 1 నుంచి సెట్స్ మీదకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న 'ఖిలాడీ' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి దేవీశీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శరత్ మండవ డర్శకత్వంలో 'రామారావు' అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదే క్రమంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న మరో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టడానికి రవితేజ రెడీ అవుతున్నాడట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నట్టు తెలుస్తోంది.